![]() |
![]() |

ఎన్నో విభిన్నమైన కాన్సెప్ట్ లతో వీడియోలు రూపొందించి దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన వ్యక్తి భువన్ బామ్. గుజరాత్ లోని వడోదర కి చెందిన భువన్ హాస్యప్రధానమైన కంటెంట్ లని రూపొందించడంలో దిట్ట. తాజాగా ఆయనకీ సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
భువన్ ఇటీవలే సుమారు 11 కోట్లుకి పైగా విలువ చేసే బంగ్లా ని కొనుగోలు చేసాడు. దేశ రాజధాని ఢిల్లీ లోని కైలాష్ అనే ఏరియాలో భువన్ ఆ బంగ్లాని కొనుగోలు చేసాడు. 2015 లో యుట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భువన్ ప్రస్తుతం బీబీ కీ వైన్స్ అనే పేరుతో తన ఛానల్ ని నిర్వహిస్తున్నాడు. 26 .4 మిలియన్ ల సబ్ స్క్రైబర్స్ ని కూడా కలిగి ఉన్నాడు.
ఇటీవలే సంగీతంలోకి కూడా అడుగుపెట్టి తన ఛానెల్ ద్వారా చాలా సాంగ్స్ రిలీజ్ చేసాడు.అవన్నీ కూడా ప్రేక్షకాదరణని పొందాయి.అలాగే దిండోరా, రాఫ్తా రాఫ్తా, తాజా, ఖబర్ వంటి వెబ్ సిరీస్ ల్లోను నటించాడు.
![]() |
![]() |